Wednesday, May 8, 2024

ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు…. ప్రజలు గెలవాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాందేడ్: దేశం మొత్తం మార్పు తీసుకరావాలనే లక్ష్యంతో బిఆర్‌ఎస్ ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బిఆర్‌ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలకు కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని, కర్నాటక ఫలితాలు చేసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం జరిగిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలు గెలవాలన్నారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలన్నారు. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నామని, ప్రతి సంవత్సరం వేల టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తోందని కెసిఆర్ దుయ్యబట్టారు. నాందేడ్‌లో రెండు రోజుల పాటు బిఆర్‌ఎస్ శిక్షణ శిబిరం జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News