Sunday, April 28, 2024

‘ఆదిపురుష్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Adipurush released in 2023 January

 

రెబల్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

జనవరి 12, 2023లో సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు మేకర్స్. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఆదిపురుష్ సినిమా కోసం పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News