Sunday, August 10, 2025

త్వరలో ఎఐ వర్శిటీ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

ఈ యాప్సిస్ విస్తరణతో హైదరాబాద్ ప్రపంచ సాంకేతిక, ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న స్థానం మరింత బలపడిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. విస్తరించిన ఈ యాప్సిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను శనివారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఒరాకిల్, ఏఐ, కొత్త సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మార్పుకు తోడ్పడుతూ ఈ యాప్సిస్‌హైదరాబాద్ వర్క్‌ఫోర్స్‌ను 500కి పైగా పెంచనుంది. సర్వీస్ ఆధారిత కంపెనీలను నడపడం తేలిక. కానీ ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలు ఎక్కువ సవాళ్లు ఎదుర్కొంటాయి. హైదరాబాద్ టెక్ హబ్‌గా పెరుగుతున్న గుర్తింపు ప్రశంసనీయం అని, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఎగుమతుల్లో తె లంగాణను అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కంపెనీలు యూనికార్న్ స్థాయిని సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

గతంలో మూడు మాత్రమే ఉన్న యూనికార్న్‌లు ఇప్పుడు హైదరాబాద్‌లో 30-40 కి పెరిగాయని, 400 సీట్లు ఉన్న ఈ కొత్త కార్యాలయం సామర్థ్యం భవిష్యత్తులో 4-6 రెట్లు పెరిగి రాష్ట్రం, నగరానికి మరింత గుర్తింపును తెస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. యూకే ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ గ్లోబల్ ఒరాకిల్ భాగస్వామి ఐటీ సేవల సంస్థ హైదరాబాద్‌లో ప్రస్తు తం ఉన్న 200 మంది సిబ్బందిని వచ్చే రెండు సం వత్సరాల్లో 500 మందికి పైగా పెంచాలని ప్రణాళికలు ప్రకటించింది. అత్యాధునిక 400 సీట్ల సామర్థ్యంతో కూడిన కొత్త సౌకర్యాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌లో జోడించడం ద్వారా హైదరాబాద్‌ను ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్‌పి, ఏఐ, ంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసులకు వ్యూహాత్మక కేంద్రంగా మరింత బలపరిచింది. ఈ కొత్త సెంటర్ ద్వారా ఒరాకిల్ క్లౌడ్/ఈఆర్‌పి కన్సల్టెంట్లు, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్పెషలిస్టులు వం టి వందలాది అధిక నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించబడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News