Monday, May 13, 2024

కోమటిరెడ్డిపై ఎఐసిసి సీరియస్

- Advertisement -
- Advertisement -

కోమటిరెడ్డిపై ఎఐసిసి సీరియస్
వీడియో క్లిప్పింగ్స్ పంపాలని ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్, పిసిసి నియామకంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై అధిష్టానం ఆరా తీసింది. రాష్ట్ర పిసిసి పదవిని అమ్ముకున్నారన్న కామెంట్స్‌పై ఎఐసిసి సీరియస్ అయింది. ఈక్రమంలో కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ పంపించాలని ఎఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ కమిటీకి ఎఐసిసి ఆదేశించింది. ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసిన వీడియోలను ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ నేత మహేశ్వర రెడ్డి పంపించారు. కాగా కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పిసిసి ఎన్నిక జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. టిపిసిసి కాదని, టిడిపి పిసిసిగా మారిందన్నారు. రాష్ట్ర పిసిసి పదవిని ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ అమ్ముకున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టి పిసిసిలో సామాన్య కార్యకర్తలకు గుర్తింపు లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడంపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వీడియో క్లిప్పింగ్స్‌ను ఢిల్లీకి పంపాలని ఆదేశాలిచ్చింది.

AICC Serious on Komatireddy Venkat reddy comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News