Tuesday, April 30, 2024

నన్ను చంపాలనుకున్న వారిని క్షమిస్తున్నా: అక్బరుద్దీన్ ఒవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాత బస్తీలో 12 ఏళ్ల క్రితం తనను అంతం చయడానికి ప్రయత్నించిన వారందరినీ క్షమిస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) ఎమ్మెల్యే అక్కరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సలాలా బర్కాస్‌ఓ ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్లెన్స్‌కు చెందిన నూతన భవనం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్టాడుతూ తన రక్తం చిందించిన వారిని క్షమించివేసినట్లు చెప్పారు. తన అభివృద్ధిని అడ్డుకోవడాకి ప్రయత్నించిన వారిని, తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నట్లు అక్బరుద్దీన్ తెలిపారు.

2011లో అ్బరుద్దీన్‌పై 15 మంది వ్యక్తులు కత్తులు, కొడవళ్లు, తుపాకులతో దాడి చేసి చంపివేసేందుకు యత్నించారు. ఈ దాడిలో అక్బరుద్దీన్ కడుపులో తూటా దిగింది. ప్రాణాలతో బయడపడినప్పటికీ అక్బరుద్దీన్ ఇప్పటికీ ఆ దాడిలో జరిగిన గాయాలతో బాదఫడుతున్నారు.

ఇక రాజకీయ పరంగా చూస్తే అక్బరుద్దీన్ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ రానున్న తెలగాణ శాసనసబ ఎన్నికల్లో పోటీచేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తన కుటుంబానికి చారిత్రకంగా ప్రాముఖ్యమున్న చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే నూరుద్దీన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన తాత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, పెదనాన్న, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తమ రాజకీయ జీవితాన్ని చార్మినార్ నుంచే ప్రారంభించారు. గత 40 ఏళ్లుగా చార్మినార్ అసెంబ్లీ స్థానం ఎంఐఎం అధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ముంతాజ్ అమ్మద్ కాన్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుననారు.

ఎంబిబిఎస్ డిగ్రీ పొందిన డాక్టర్ రూరుద్దీన్ ఒవైసీ ప్రస్తుతం సలార్ ఇ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు టస్టీకి వ్యవవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News