Sunday, May 5, 2024

‘వర్షాలు తప్పనిసరిగా వస్తాయి.. కానీ’: స్వర్ణలత భవిష్యవాణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారని జోగిని స్వర్ణలత తెలిపారు. ప్రతి ఏటా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తున్న విషయం తెలిసిందే. బోనాలలో భాగంగా రంగం కార్యక్రమంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

“ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. లోపాలు లేకుండా పూజలు చేసినందుకు సంతోషంగా ఉన్నా. ఏ పూజాలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా. వర్షాలు తప్పనిసరిగా వస్తాయి.. కానీ, ఒడిదొడుకవుతుంది. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రజలు భయపడొద్దు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం నాదే. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భాద్యత నాదే. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి” అని చెప్పింది. కాగా, భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News