Thursday, May 2, 2024

ఈ ఏడాది కూడా హజ్ యాత్ర రద్దు

- Advertisement -
- Advertisement -
All applications for Haj 2021 cancelled
భారత హజ్ కమిటీ ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సౌదీ అరేడియాలో నివసించే ప్రజలను మాత్రమే పరిమితి సంఖ్యలో హజ్ యాత్రకు అనుమతిస్తామని ఆ దేశం ప్రకటించడంతో ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతించాలని వచ్చిన దరఖాస్తులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు భారత హజ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా రాజ్యంలో నివసించే పౌరులు, నివాసులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతించాలని, అంతర్జాతీయ హజ్ యాత్రికులను అనుమతించరాదని నిర్ణయించినట్లు సౌదీ అరేబియాకు చెందిన హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ ప్రకటించిందని భారత హజ్ కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కారణంగా హజ్-2021 కోసం వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు చేస్తున్నామని హజ్ కమిటీ ప్రకటించింది. గత ఏడాది కూడా కరోనా వైరస్ కారణంగా భారత్ నుంచి హజ్ యాత్రకు ముస్లిములను అనుమతించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News