Tuesday, May 7, 2024

గులాబీ పురకించాలి

- Advertisement -
- Advertisement -

corporations

 

కార్పొరేషన్ల అన్నింటా మన జెండా ఘనంగా ఎగరాలి

కార్పొరేషన్ల ఏర్పాటుతో నగరాల్లో అభివృద్ధి బాగా పుంజుకుంది
వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లకు ప్రత్యేక నిధులిచ్చాం
కరీంనగర్, నిజామాబాద్‌లలో బిజెపి, కాంగ్రెస్‌ల కుమ్మక్కును ప్రజలకు తెలియజేయండి
ఆయా పురపాలికల మంత్రులు, ఎంఎల్‌ఎల సమావేశంలో కెటిఆర్

హైదరాబాద్ : పురపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలకమైన కార్పొరేషన్లలో భారీ విజయం కోసం టిఆర్‌ఎస్ పార్టీ కీలకమైన కసరత్తు చేస్తోంది. మున్సిపాలీటీల్లోని నాయకులు, ఎంఎల్‌ఎలతో శనివారం సమావేశమైన టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆదివారం కార్పొరేషన్లలోని మం త్రులు, నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ము న్సిపల్ ఎన్నికలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతు న్న 10 కార్పొరేషన్లన్నింటిలో విజయం సాధించాలని ఈ సందర్భంగా వారికి కెటిఆర్ తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో కార్పొరేషన్లు చాలా కీలకమైనవని, భౌగోళికంగా పెద్దవైన ఈ పురపాలికల్లో పార్టీ విజయం సాధించాల్సిందేనని అన్నారు. పార్టీ విజయం కోసం పూర్తి స్ధాయి ప్రయత్నాలు చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.

మున్సిపాలిటీలతో పోల్చితే, కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్ పార్టీ తరపున పెద్దఎత్తున నామినేషన్లు వేసిన నేపథ్యంలో పార్టీ బి.ఫారాలు దక్కే అభ్యర్ధులు మినహా ఇంకా ఎవరూ పోటీలో లేకుండా చూడాలనని, నామినేషన్ల ఉపసంహరణపైన దృష్టి పెట్టాలని అదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదీగూడా, జవహార్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లలోని క్షేత్రస్థాయి పరిస్ధితులపై చర్చించారు.

అయా కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎంఎల్‌ఎలతో కెటిఆర్ స్వయంగా మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ నామినేషన్లు వేసిన అభ్యర్ధుల సంఖ్యతోపాటు నగరాల్లో ప్రచారం జరుగుతున్న తీరుపైన చర్చించారు. పార్టీ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలని పేర్కొన్నారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆయా నగరాల అభివృద్దికి కృషి చేస్తున్న తీరుని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని సూచించారు. ఈ దఫా నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్ల అభివృద్దికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇవ్వాలని కోరారు.

కార్పొరేషన్లపై పల్లా, సుభాష్‌రెడ్డిలతో సమీక్ష
మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శేరి సుభాష్ రెడ్డిలతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగర శివారులోని కార్పొరేషన్లపైన పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినందున వాటిలో విజయం పార్టీకి చాలా కీలకమని మంత్రి మల్లారెడ్డికి తెలిపారు. ఈ మేరకు వాటి లో ఉన్న పార్టీ స్ధితిగతులు, కార్యాచరణపైన చర్చించారు. శివార్లలో పురపాలికలను ఏర్పాటు చేయకముందు ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకుపోవాలని కోరారు.

కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా వచ్చే మౌళిక వసతులు, అభివృద్ది కార్యక్రమాల ద్వారా కలిగే ప్రయోజనాలను సైతం తెలియజేయాలన్నారు. రామగుండం స్ధా నిక ఎంఎలల్‌ఎ కోరుకంటి చందర్, మంత్రి కొప్పల ఈ శ్వర్‌తో కెటిఆర్ సమావేశం అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలో విజయం సాధించేందుకు మంత్రి కొప్పుల సహకా రం తీసుకోవాలని ఎంఎల్‌ఎకు సూచించారు. స్ధానికంగా ఉన్న నాయకులతోపాటు రామగుండం నగరంలోని నాయకులతో మంత్రి కొప్పులకున్న సంబంధాలు ఈ ఎన్నికలల్లో విజయానికి ఉపయోగపడతాయని అన్నారు.

బిజెపి-కాంగ్రెస్ అనైతిక తీరును ఎత్తిచూపాలి
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయి, లోపాయికారీగా కలిసి పనిచేస్తున్న తీరును ప్రజల ముందుపెట్టాలని కెటిఆర్ అన్నారు. ఈ రెండు కార్పొరేషన్ల ఎన్నికలపై కెటిఆర్ చర్చించారు. ఈ రెండు కార్పొరేషన్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు టిఆర్‌ఎస్‌ను సొంతగా ఎదుర్కోలేకపోతున్నాయని, ఇదే టిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని సూచిస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీల అనైతిక తీరుని ఎత్తి చూపాలని కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు ఎంఎల్‌ఎ గణేష్ బిగాలతో మాట్లాడారు.

 

All corporations must fly TRS flag
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News