Thursday, May 2, 2024

నవ సారథులు

- Advertisement -
- Advertisement -

 TRS Party Coordinating Committee

 

మున్సిపోల్స్‌కు 9మందితో టిఆర్‌ఎస్ సమన్వయ కమిటీ, జిల్లాల వారీగా బాధ్యతలు

సమన్వయ కమిటీ సభ్యులు

పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్ రావు, దండె విఠల్, ఎంఎల్‌సిలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల బరిలో భారీ విజయం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పూర్తి ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసేందుకు పురపాలిక ఎన్నికల కోసం కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్ రావు, దండె విఠల్, ఎంఎల్‌సిలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులు ఉన్నారు. తొమ్మిది మందితో ఏర్పాటుచేసిన ఈ కమిటీ ప్రతి పురపాలికలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్ధానిక నాయకత్వానికి సహకారం అందిస్తుంది.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో సమావేశమైన కెటిఆర్ కమిటీ సభ్యులు జిల్లాల వారీగా ఒక్కొక్కరు భాద్యత తీసుకుని స్దానిక ఎంఎల్‌ఎలు, సీనియర్ నాయకులతో మాట్లాడాలని సూచించారు. అలాగే అయా జిల్లాల్లోని ప్రతి పురపాలికల్లోని ఎన్నికలను నేరుగా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారానికి అవసరమైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని, ఇందుకోసం ప్రతిరోజు పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని అదేశించారు.

సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆదివారం నుంచి ఈ నెల 14 తేది వరకు పార్టీ తరపున బి.ఫారాలు పొందిన అభ్యర్థులు కాకుండా నామినేషన్ వేసిన అభ్యర్ధులతో మాట్లాడి, వాటిని ఉపసంహరించుకునేలా చూడాలని, ఈ ప్రక్రియపైన ప్రధాన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సాద్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ ప్రతి రోజు పార్టీ కార్యాలయం నుంచి పనిచేయాలని చెప్పారు. ఈ కమిటీ సభ్యులు కచ్చితంగా పార్టీ కార్యాలయంలోనే సాద్యమైనంత ఎక్కువ సమయం ఉండాలని కెటిఆర్ అదేశించారు.

జిల్లాల వారీగా కోఆర్డినేటర్లు
వరంగల్- బాలమల్లు, కరీంనగర్- బొంతు రామ్మోహన్, రంగారెడ్డి ఎంఎల్‌సి నవీన్ రావు, మహబూబ్‌నగర్- డికె శివకుమార్, ఆదిలాబాద్- దండె విఠల్, ఖమ్మం- గట్టు రామచంద్రరావు, మెదక్- శేరి సుభాష్‌రెడ్డి, నిజామాబాద్- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ- పల్లా రాజేశ్వర్‌రెడ్డి

క్షేత్రస్థాయి పరిస్థితులపై కెటిఆర్ దృష్టి
మున్సిపల్ ఎన్నికల బరిలో క్షేత్రస్ధాయిలో ముందువరుసలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ, తదుపరి ప్రచారం, ఎలక్షనీరింగ్ వంటి వాటిపైన ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించడం, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలు, మంత్రులతో ప్రత్యేక సమావేశాల నిర్వహిస్తున్నారు. ప్రతి పురపాలికలోని క్షేత్రస్ధాయి పరిస్ధితులను తెలుసుకుంటున్నారు.

Formation of TRS Party Coordinating Committee
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News