Thursday, May 2, 2024

తెలంగాణలో అభివృద్ధిని ఓర్వలేకనే ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని, రైతులకు ఉచితంగా ఇస్తున్న 24గంటల పథకాన్ని ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.బుధవారం చిట్యాల మండలంలోని నైనపాక గ్రామంలో 33/11 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని, గతంలో ప్రభుత్వాలు రాత్రిపూట కోతలతో విద్యుత్ సరఫరా చేయడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఎంఎల్‌ఏ తెలిపారు.
రాష్ట్రంలోని కొంత మంది నాయకులు వ్యవసాయం గురించి తెలియకుండా ఎకరం పొలానికి గంట సమయంలో పారుతుందని, రైతులకు మూడు గంటల మాత్రమే విద్యుత్ సరిపోతుందని మాట్లాడుతున్నారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కెసిఆర్ హయాంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్‌ర్మర్ల రిపేర్లు లేవని ఎంఎల్‌ఏ అన్నారు. విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా అనేక సబ్ స్టేషన్లు నిర్మించామని అన్నారు. భూపాలపలిల నియోజకవర్గంలో భూ సమస్యల పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలో అర్హులందరికి పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు.
గతంలో అందించే 200 పెన్షన్లు ప్రస్తుం 2016 పంచామని, దివ్యాంగులకు రూ.4016 అందిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ మన రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అద్బుతమైన ప్రగతి సాధించామని, గతంలో ఉన్న విద్యుత్ కోతలకు స్వస్తి చెబుతూ ప్రతి రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇటీవలే విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయం ప్రారంభించామని అన్నారు.
దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం వృద్దిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, గతంలో 1100 యూనిట్ల ఉన్న తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, గతంలో 1100 యూనిట్ల ఉన్న తలసరి వినియోగం నేడు 2వేల యూనిట్లు పైగా పెరిగిందని అన్నారు. విద్యుత్ సంక్షేమం లేని కారణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తలసరి ఆదాయ వృద్దిలో సైతం దేశంలో ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గొర్రె సాగర్, పిఏసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్‌లు తొట్ల లక్ష్మి, పెండెల సాంబయ్య, ఎంపిటిసి కట్టెకొల్ల రమేష్, వైస్ ఎంపిపి రాంబాబు, పిఏసిఎస్ డైరెక్టర్ స్వప్న, మహిళా మండలి అధ్యక్షురాలు మల్లమ్మ, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News