ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు. పి దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ హిట్ సాంగ్స్‌తో ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలను సృష్టించింది. ఈ చిత్రంలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్‌గా కనిపించనున్నారు. ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే ఆంధ్రా కింగ్’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ అవతార్‌లో ఉపేంద్ర అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు. ఇది ఒక అభిమాని బయోపిక్‌గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ‘కల్కీ’ సీక్వెల్ నుంచి దీపికా ఔట్