Thursday, May 2, 2024

నోర్జే అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే అరుదైన రికార్డును సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో నోర్జే ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిన విసిరి కొత్త రికార్డును సృష్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నోర్జే ఓ బంతిని గంటకు 156.2 కి.మీ. వేగంతో విసిరి ఐపిఎల్ చరిత్రలోనే కొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో ఏ బౌలర్ కూడా ఇంత వేగంగా బంతిని వేయలేదు. రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఈ బంతిని ఎదుర్కొన్నాడు. అయితే నోర్జే రికార్డు వేగంతో వేసిన ఈ బంతిని బట్లర్ బౌండరీకి తరలించడం విశేషం.

అంతేగాక ఇదే ఓవర్‌లో నోర్జే గంటకు 155.1 కి.మీ. వేగంతో మరో బంతిని కూడా వేశాడు. ఇది కూడా ఐపిఎల్‌లో రెండో వేగవంతమైన బంతిగా నిలిచింది. ఈ బంతిని ఎదుర్కొవడంలో బట్లర్ విఫలమయ్యాడు. రికార్డు వేగంతో బంతిని విసిరిన నోర్జే బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గతంలో డేల్ స్టెయిన్ గంటకు 154.4 కి.మీ వేగంతో బంతిని విసిరి రికార్డును నెలకొల్పాడు. తాజాగా ఈ రికార్డును నోర్జే చెరిపేశాడు. ఒకే ఓవర్‌లో రెండు సార్లు కొత్త రికార్డును నెలకొల్పి అత్యంత అరుదైన ఘనతను నోర్జే తన పేరిట లిఖించుకున్నాడు.

Anrich Nortje fastest delivery in IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News