- Advertisement -
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవానులు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శనివారం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఇది ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో అత్యంత దీర్ఘమైన వాటిలో ఒకటి. ఆగస్టు ఒకటిన భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టినప్పటి నుంచి ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదులు ఏ గ్రూప్‌కు చెందిన వారన్నది ఇంకా తెలియలేదు. అడవిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించేందుకు భద్రతాబలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లు వాడుతున్నాయి. దాక్కుని ఉన్న ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడానికి భద్రతా బలగాలకు పారా కమాండోలు కూడా సహకరిస్తున్నారు.
- Advertisement -