Wednesday, May 15, 2024

మాజీ ఐఎఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఎపి సిఐడి సోదాలు

- Advertisement -
- Advertisement -

AP CID searches house of former IAS Lakshminarayana

రూ.242 కోట్లు షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు
ఈనెల 13న హాజరుకావాలని సిఐడి నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న మాజీ ఐఏఎస్ అధికారి డా. లక్ష్మీనారాయణ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్ర వరకు సోదాలు నిర్వహించారు. మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ ఇదివరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సిఎస్‌గా, అంతకంటే ముందు ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గానూ పనిచేశారు. నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సిఐడి అధికారులు వివరిస్తున్నారు.

దాదాపు రూ. 242 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయ్యిందని సిఐడి అధికారులు పేర్కొంటున్నారు. కాగా సోదాలు కొనసాగుతున్న సమయంలో లక్ష్మీనారాయణ అధిక రక్తపోటు(బిపి)వల్ల కళ్లు తిరిగి పడిపోవడంతో ఇప్పటికే ఆయనుకు రెండు సర్జరీలు అయినట్లు కుటుంబసభ్యులు సిఐడి అధికారులకు తెలిపారు. విచారిస్తున్న సమయంలో లక్ష్మీనారాయణకు బిపి పెరిగిందని, దీంతోబ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొనడంతో ఆయన్ను స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిఐడి అధికారులు అంగీకరించారు. కాగా మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో టిడిపి నేత పయ్యావుల కేశవ్, పత్రికాధిపతి వేమూరి రాధాకృష్ణతో టిడిపి నేతలు అక్కడికి చేరుకున్నారు.

మాజీ ఐఎఎస్‌కు నోటీసులు

ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల మేరకు మాజీ ఐఎఎస్ డా.లక్ష్మీనారాయణకు ఎపి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఎ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఎపి సిఐడి చేర్చింది. డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ పేర్లను ఉ4, ఎ5గా సిఐడి పేర్కొంది.

ఏమాత్రం సంబంధం లేదు

ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవినీతిపై మాజీ ఐఎఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణను సిఐడి అధికారులు ప్రశ్నించారు. దీంతో 2017 జివొ ఎంఎస్- 4 గురించి తనకు తెలియదని, తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని ఆయన తెలిపారు. సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని సిఐడి అధికారులు ప్రశ్నించడంతో సిమెన్స్ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్ మేనేజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవొయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని ఆయన వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News