Friday, May 3, 2024

‘వకీల్ సాబ్’ మూవీ టికెట్ ధరల పెంపుపై ఎపి హైకోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

AP HC Hearing on ticket prices hike of Vakeel Saab 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ టికెట్ ధరల పెంపుపై ఎపి హైకోర్టు విచారించింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ ఎపి ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. దీంతో శనివారం విచారించిన ఎపి హైకోర్టు మూవీ టికెట్ల ధరలు పెంచొద్దని ఆదేశించింది. టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. దీంతో రేపటి నుంచి టికెట్ల ధరలు పెంచొద్దని హైకోర్టు ఆదేశించింది. రేపు అడ్వాన్స్ బుకింగ్ కాకుండా మిగతా టికెట్లు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే అమ్మాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటించి ‘వకీల్ సాబ్’ సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది. తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

AP HC Hearing on ticket prices hike of Vakeel Saab 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News