Monday, August 4, 2025

ఎపి లిక్కర్ స్కామ్ కేసు.. ఎవరీ వెంకటేష్ నాయుడు?

- Advertisement -
- Advertisement -

వైరల్ అయిన వీడియోలో లెక్కిస్తున్న రూ.35 కోట్లు ఎవరివి?
లిక్కర్ స్కామ్ సొమ్మేనా? మరేదైనా..!
సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి లిక్కర్ స్కామ్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియో ప్రస్తుతం వైరలయ్యింది. వెంకటేష్ నాయుడు వైసిపి అధినేత జగన్, టిడిపి ఎంపి పెమ్మసానితో ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. వెంకటేష్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని, అతనొక పవర్ బ్రోకర్ అని, ఎవరు అధికారంలో ఉంటే వారితో ఫోటోలు దిగుతూ వారిని మంచి చేసు కుంటాడని తెలుస్తోంది. ప్రైవేట్ ఫ్లైట్ లలో తిరుగుతూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన పనులు చేయించి పెడుతూ ఉంటాడని అంటున్నారు. ఎపి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు. అయితే వైరల్ అయిన వీడియో లో వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న 35 కోట్ల రూపాయలు నగదు ఎవరిది అన్నదానిపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న నోట్ల కట్టల్లో రెండు వేల రూపాయల నోట్లు కూడా ఉండటంతో ఆ వీడియో ఎప్పుడు తీసినది అన్నదానిపై కూడా చర్చ సాగుతోంది.

ఆ వీడియో రెండు వేల రూపాయల నోట్లు రద్దు అయిన తర్వాత తీసిన వీడియోనా? లేక తర్వాత తీసిన వీడియోనా? అనే చర్చ ఊపందుకుంది. వీడియోలో ఉన్న నోట్ల కట్టలు లిక్కర్ స్కాంకి సమందించినదా? లేక వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్న మరో కేసు నందిగామలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిందా? అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని పనులు చేయించుకుంటూ, చేసి పెడుతూ వారికి లబ్ది చేకూరుస్తుంటాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడును విచారిస్తే తప్ప పూర్తి విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేవంటున్నారు. అయితే ఇతని బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసు అధికారులే బిత్తరపోతున్నారు. రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News