Sunday, April 28, 2024

ఎపిలో కొనసాగుతున్న పోలింగ్

- Advertisement -
- Advertisement -

AP Panchayat Elections 2021

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ తొలిదశ ఎన్నికలు మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలు మధ్యాహ్నం 3.30గంటల వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో తొలిదశ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎపిలో తొలిదశలో 2,723 పంచాయతీలకు, 20,157 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎపి పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం కల్పించారు అధికారులు. మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక జరుగునుంది. అన్ని చోట్ల కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ  పోలింగ్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News