Sunday, April 28, 2024

నేటి నుంచి బిహెచ్‌ఎంఎస్ మేనేజ్‌మెంట్ కోటాకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

Applications for the BHMS Management Quota

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో బిహెచ్‌ఎంఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. నీట్ -2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తరవాత దరఖాస్తుల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీచేస్తుంది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News