Saturday, April 27, 2024

జానపద తరహాలో గీతాలు చేశా

- Advertisement -
- Advertisement -

తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన ’మామన్నన్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ’నాయకుడు’గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగులో ఈనెల 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమా కథ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీంతో ఈ సినిమా చేశాను.

దర్శకుడు మారి సెల్వరాజ్ తన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు మరింత మాస్ అప్పీల్ ఇచ్చారు. సంగీతం ఎక్కువ మందికి చేరువ అయ్యేలా ఉండాలనుకున్నారు. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత నేను జానపద తరహాలో గీతాలు చేశా. ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. ఈ సినిమా కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇదొక టఫ్ సబ్జెక్టు. బాగా డీల్ చేశారు. ’నాయకుడు’లో తండ్రీ కుమారుల మధ్య అనుబంధం ఉంటుంది. రాజకీయం ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News