Friday, May 3, 2024

విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of accused selling foreign cigarettes

పదకొండు రకాల సిగరేట్లు స్వాధీనం

హైదరాబాద్: విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న నిందితుడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5లక్షల విలువైన 23 బాక్స్‌ల సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… గోషామహల్‌కు చెందిన మంగీలాల్ జైన్ నిషేధీత సిగరేట్లను విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News