Saturday, April 27, 2024

కళా దర్శకుడు నితిన్ దేశాయ్ మృతి: రూ. 252 కోట్ల రుణ ఎగవేత

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలోగల తన స్టూడియోలో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించిన ప్రముఖ కళా దర్శకుడు నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఒక ఆర్థిక సంస్థకు రూ. 252 కోల్లు బకాయిపడ్డారు. గత వారం ఆయన కోర్టులో దివాలా పిటిషన్(ఐపి) దాఖలు చేశారు.

దేశాయ్ తన కంపెనీ ఎన్‌డి ఆర్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఇసిఎల్ ఫైనాన్స్ నుంచి 201666, 2018లో రూ. 185 కోట్లను రెండు విడతలుగా రుణాలు పొందారు. కాగా..2020 జనవరి నుంచి రుణచెల్లింపులలో సమస్యలు మొదలయ్యాయి.
బుధవారం ఉదయం ఎన్‌డి స్టూడియో ఆవరణలో దేశాయ్ మృతదేహం లభించింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన మరణానికి కఛ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

లగాన్, దేవదాస్ వంటి భారీ సినిమాలకు కళా దర్శకుడిగా పనిచేసిన దేశాయ్ ముంబై నగర శివార్లలోని ఖలాపూర్ తాలూకాలో విశాలమైన ఆవరణలో సూడియో నిర్మించుకున్నారు. .జోధా అక్బర్ చిత్ర నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరిగింది. ఎన్‌డి ఆర్ట్ వరల్ట్ నిర్వహించే వ్యాపారాలలో చారిత్రక స్మారకాలకు చెందిన నమూనాల నిర్వహణ, హోటల్స్, థీమ్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, రిక్రియేషన్ సెంటర్స్‌కు సబంధించిన సేవలు అందించడం మొదలైనవి ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News