Tuesday, May 7, 2024

ఢిల్లీ కాలుష్యానికి కృత్రిమవర్షాల అడ్డుకట్ట..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షాలు కురిపించనున్నారు. ఈ నెల 20, 21 తేదీలలో మేఘమథనం ద్వారా ఈ కృత్రిమ వర్షాలు ఢిల్లీపై కురిపించేందుకు అవకాశం ఉంది. ఈ విషయం గురించి ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం ఐఐటి కాన్పూర్‌కు చెందిన బృందంతో సమావేశం అయ్యారు. ఢిల్లీలో పలు కారణాలతో ఇప్పుడు దట్టమైన పొగమంచుతో వాయుకాలుష్య తీవ్రత ప్రమాదకర స్థితికి చేరుకుంది. వెంటనే ఈ విపరీత పరిణామం నుంచి ప్రజలను కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. గాలిలో సరైన తేమను సాంద్రతను పెంచేందుకు ఇప్పుడు వర్షాలు పడాల్సి ఉంది. దీనిని గుర్తించి కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రంగం సిద్ధం అయింది.

ఈ నెల 20 లేదా 21 వ తేదీలలో దట్టంగా మబ్బులు ఉంటే , వర్షాలు కురిపించేందుకు శాస్త్రీయ మార్గాలలో ప్రయోగాలు జరుగుతాయి. దీని గురించి ఐఐటి కాన్పూర్ నిపుణుల బృందంతో చర్చించినట్లు ఆ తరువాత మంత్రి విలేకరులకు తెలిపారు. కాలుష్య నివారణకు కృత్రిమ వర్షాలు ఓ మార్గమని ఐఐటి కాన్పూర్ నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి ఓ సూచన అందింది. దీనిపై తాము విశ్లేషించినట్లు, గురువారం తమకు దీని కార్యాచరణ ప్రతిపాదనలు అందుతాయని మంత్రి తెలిపారు. దీనిని తరువాత సుప్రీంకోర్టు ముందుకు పంపిస్తామని , తరువాత ఈ ప్రయోగం జరిపేందుకు వీలుంటుందని మంత్రి వివరించారు. మబ్బులు కమ్ముకునేందుకు అనువైన తేదీలను గుర్తించారు. సంబంధిత అనుమతులు అన్ని దక్కితే కృత్రిమ వర్షాలకు ప్రయోగాత్మక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News