Wednesday, May 8, 2024

హిందుత్వం పైనే పోరు నడుస్తోంది: ఓవైసీ విమర్శలు

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi lashes out at BJP, Samajwadi Party

 

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలపై ఏఐఎంఐఎం అధినేత , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాసమస్యలు,అభివృద్ధి, సమాజానికి న్యాయం వంటి అంశాలపై కాకుండా హిందుత్వంపై మతంపై ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ గొప్ప హిందుత్వం పోటీ పెట్టుకున్నారని, మోడీ కంటే గొప్ప హిందువు తానేనని నిరూపించుకునే పనిలో ఇద్దరూ మునిగి పోయారని ఓవైసీ దుయ్యబట్టారు.ఒకరు మందిరం గురించి మాట్లాడితే మరొకరు వేరే మందిరం గురించి మాట్లాడతారని ఓవైసీ వ్యాఖ్యానించారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం 100 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఓవైసీ ప్రకటించారు. భాగస్వామ్య సంకల్ప కూటమి పేరుతో కొన్ని పార్టీలతో కలిసి ఏఐఎంఐఎం పోటీ చేస్తోంది. తమ కూటమి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంచుకున్నామని, ఈ ఎన్నికల్లో తాము అధికారం లోకి వస్తే బాబు సింగ్ కుశ్వాహా మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో రెండున్నరేళ్లు దళిత ముఖ్యమంత్రి ఉండారని ఓవైసీ వివరించారు. ఇక ఉపముఖ్యమంత్రులు ముగ్గురు ఉంటారని, ఒకరు ముస్లిం మార్గానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉంటారని, ఓవైసీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News