Sunday, April 28, 2024

భార్య తిట్టినా భరించడమే మగ మానవీయం:అసదుద్దిన్ ఒవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భర్త భార్యను తిట్టరాదు, భార్య తిట్టినా , విసుక్కున్నా మౌనంగా ఉండాలి. ఎదురు వాదనకు దిగరాదు అని హైదరాబాద్ ఎంపి, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా మానవీయ సంబంధాలు, ప్రత్యేకించి భార్య భర్తల బంధం గురించి ఈ ఎంపి ప్రస్తావించారు. భార్యను కొట్టడం తిట్టడం మగతనం కాదని, ఈ విషయాన్ని భర్త గుర్తుంచుకోవాలని కరకుగా తెలిపారు. మగవాడి గొప్పతనం అనేది భార్య పట్ల ఓపికగా ఉండటం, వారిని తగు విధంగా గౌరవించడంతోనే విదితం అవుతుంది. ఎందుకంటే భార్య ఓ ఇంటి ఇల్లాలుగా కుటుంబాన్ని రక్షిస్తుంది. తల్లిగా పిల్లలను సాకుతుంది. వంశానికి మూలాధారం అవుతుందని ఇక్కడ జరిగిన ఇస్లామ్ మే కావాతీన్ కా మఖామ్ (ఇస్లామ్‌లో మహిళల పట్ల వైఖరి) అనే ఇతివృత్తంతో సాగిన కార్యక్రమంలో ఎంపి ప్రసంగించారు. వివాహితుడు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే.

ఇస్లామ్‌లో ఎక్కడ కూడా భార్య మగవాడి దుస్తులు ఉతుకుతూ , సేవలు అందిస్తూ ఉండాలని ఆదేశించలేదు. ఆమె యంత్రంగా పడి ఉండాలని ఎక్కడ చెప్పలేదు. పైగా భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదని తెలిపారు. భార్యకు కుటుంబ పోషణ చూసుకునే వ్యక్తిగా భర్త ఆదాయం వివరాలు అడిగే హక్కుందని పేర్కొని ఉందని తెలిపారు. ఎందుకంటే ఆమె తన కుటుంబం గురించి ఆలోచిస్తుందని, తన కోసం కాదని, తన జీవితాన్ని ఓ కుటుంబం కోసం త్యాగం చేయడం, దీనిని త్యాగంగా ఎప్పుడూ భావించకుండా నిస్వార్థంగా సాగడం ఆమె గొప్పతనం అని కొనియాడారు. ఇస్లాం గాలిలో నుంచి పుట్టలేదు. జీవిత సత్యాల నుంచి ఆవిర్భవించింది. ఆమెను ఆధిపత్యధోరణితో కొట్టడం జరిగితే అంతకు మించిన అపచారం మరోటి ఉండదని హెచ్చరించారు. ప్రస్తుత దశలో తాను ఇచ్చే సలహా ఒక్కటే అని ఎంతో త్యాగం చేసే మహిళ నుంచి తిట్లు వెలువడ్డా కామూష్‌గా ఉండండి, ఇదే ఓ త్యాగజీవికి మనం ఇచ్చే విలువ అని, పైగా మగవాడు తన గౌరవం తాను నిలబెట్టుకునే వాడుగా నిలబడుతాడని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News