Thursday, May 2, 2024

అస్సాం వరద పరిస్థితి ఇప్పటికీ దుర్భరం

- Advertisement -
- Advertisement -
Assam floods
ఆరవ రోజున సిల్చార్ మునిగిపోయింది
గడచిన 24 గంటల్లో మరో పది మంది మరణించారు. బార్‌పేట, ధుబ్రి, కరీం‌గంజ్, ఉదల్‌గురి జిల్లాల నుండి ఇద్దరు చొప్పున,  కాచర్, మోరిగావ్‌లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.

కరీంగంజ్: అస్సాంలో శనివారం కూడా వరద పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. మరణాల సంఖ్య 118కి పెరిగింది. ఆరవ రోజున కూడా కచర్ జిల్లాలోని సిల్చర్ పట్టణం వరద నీటిలోనే మునిగి ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బార్‌పేట, ధుబ్రీ, కరీంగంజ్, ఉదల్‌గురి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కచర్, మోరిగావ్‌లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. వారంతా వరదలు, కొండచరియలు విరిగిపడ్డంతో మరణించారు. ఇప్పటి వరకు 28 జిల్లాల్లో 3.03 లక్షల మంది వరదకు ప్రభావితులయ్యారని తాజాగా అస్సాం రాష్ట్ర విపత్తు నివారణ అధికార సంస్థ(ఏఎస్‌డిఎంఏ) బుల్లెటిన్ పేర్కొంది. దీనికి ముందు రోజు 30 జిల్లాల్లో దాదాపు 45.34 లక్షల మంది ప్రభావితులయ్యారు. ఇప్పటికీ బ్రహ్మపుత్ర నది ధుబ్రి, కొపిలి వద్ద ప్రమాద స్థాయిని ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. నీట మునిగిన సిల్చర్ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, అయితే గాయపడినవారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి తెలిపారు. వాయుసేన హెలికాప్టర్లు ఆహారం పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లను, ఇతర అవసర వస్తువులను ప్రజలకు జారవిడుస్తున్నాయని కూడా ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News