Thursday, May 2, 2024

ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు

- Advertisement -
- Advertisement -

Mayawati backs Draupadi Murmu

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు తమ నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి శనివారం వెల్లడించారు. ఈ విధంగా ప్రతిపక్షాల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపిన మొదటి పార్టీ బీఎస్పీయే కావడం గమనార్హం. బీజేపీకి మద్దతు గానో లేక ప్రతిపక్ష కూటమికి వ్యతిరేకంగానో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని మాయావతి అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, తమ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకునే గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ప్రతిపక్ష కూటమి తమని సంప్రదించలేదని మాయావతి తెలిపారు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మమతాబెనర్జీ కొన్ని ఎంపిక చేసుకున్న పార్టీలనే పిలిచారని చెప్పారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ కూడా అభ్యర్థి ఎంపికపై తమను సంప్రదించలేదన్నారు. దళితుల చేతుల్లో నాయకత్వం ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీఎస్పీ. మేం బిజెపి లేదా కాంగ్రెస్‌ను అనుసరించేవాళ్లం కాదు. పారిశ్రామికవేత్తల తోనూ, చేతులు కలప లేదు. మేం ఎప్పుడూ అణగారిన వర్గాలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటాం. ఏ పార్టీయైనా అలాంటి వర్గాలకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటే పర్యవసనాలను పక్కనబెట్టి వారి వెంట నిలుస్తామని మాయావతి పేర్కొన్నారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News