Wednesday, August 6, 2025

ల్యాప్‌టాప్ లపై ఇండిపెండెంట్ డే ఆఫర్‌లను ప్రకటించిన అసుస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తైవనీస్ టెక్ దిగ్గజం అసుస్, తమ వివిధ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్‌లను అందించటం ద్వారా భారతదేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని వేడుక జరుపుకుంటుంది. స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాల సమయంలో , వినియోగదారులు అత్యాధునిక అసుస్ ల్యాప్‌టాప్‌లతో తమ డిజిటల్ అనుభవాన్ని మెరుగు పరుచుకునేందుకు ఖచ్చితమైన అవకాశాన్ని కలిగి ఉంటారు. అధిక-పనితీరు గల గేమింగ్ మెషీన్‌ల నుండి సొగసైన ఉత్పాదకత ల్యాప్‌టాప్‌ల వరకు, అసుస్ తమ అత్యంత ప్రాచుర్యం పొందిన ROG, TUF, వివోబుక్, జెన్ బుక్ సిరీస్‌లతో సహా తమ శ్రేణి పై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు , బండిల్ డీల్‌లను తీసుకువచ్చింది.

కొనుగోలుదారులు ఇప్పుడు పరిమిత కాలం పాటు అత్యుత్తమ పనితీరు కనబరిచే అసుస్ ల్యాప్‌టాప్‌లపై 53% వరకు ఆదా చేసుకోవచ్చు, ఇది అత్యాధునిక ఆవిష్కరణలు మరియు సాటిలేని పనితీరు కలిగిన ల్యాప్‌టాప్‌లపై పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశం.ఈ పరిమిత కాల ఆఫర్‌లు ఆగస్టు 17 వరకు రిలయన్స్, క్రోమా మరియు విజయ్ సేల్స్‌తో సహా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌ల వద్ద అందుబాటులో ఉంటాయి. దీని వలన వినియోగదారులు అత్యాధునిక సాంకేతికతకు అప్‌గ్రేడ్ చేసుకోవడం గతంలో కంటే సులభం అవుతుంది.

పండుగ డిస్కౌంట్‌లతో పాటుగా , అసుస్ కస్టమర్‌లు ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ. 3,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌లు మరియు రూ. 3,699 నుండి ప్రారంభమయ్యే NCEMI తో కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈ డీల్‌ల కు మరింత ఆకర్షణకు జోడిస్తూ , అసుస్ ప్రోమో వెబ్‌సైట్ ద్వారా వారంటీ పొడిగింపు ప్రణాళికలు మరియు ప్రత్యేకమైన గూడీస్‌ను కూడా అసుస్ ఈ ఆఫర్ కాలంలో అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News