Friday, May 3, 2024

చైనాలో కత్తి దాడిలో ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

At least Seven killed in sword attack in China

బీజింగ్: చైనాలో ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఏడుగురిని హత్యగావించాడు. ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్‌లోని కాయ్‌యువాన్ నగరంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. దుండగుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. చివరికి దుండగుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. మిగతా దేశాల్లో వలె చైనాలో హింసాత్మక ఘటనలు జరగడం అరుదు. కానీ, ఇటీవల మతిస్థిమితంలేని కొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News