Home అంతర్జాతీయ వార్తలు ఇళ్లు ధ్వంసం, దగ్ధం

ఇళ్లు ధ్వంసం, దగ్ధం

Attacks on Hindus in Bangladesh

బంగ్లాలో భగ్గుమన్న మతవిద్వేషం

ఢాకా : బంగ్లాదేశ్‌లో హిందువులపై విధ్వంసకాండ అంతులేకుండా సాగుతోంది. సోమవారం జరిగిన వివిధ ఘటనలలో 66 ఇళ్లను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. హిందువులకు చెందిన కనీసం 20 ఇళ్లను తగులబెట్టారు. విజయదశమి సందర్భంగా దుర్గామాతా మందిరాలపై దాడుల నాటి నుంచి వరుసగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు సామాజిక మాధ్యమాలలో మతపర విద్వేషకర వ్యాఖ్యానాలు, మరో వైపు మైనార్టీ వర్గాల నిరసనల నడుమనే ఇళ్ల విధ్వంసాలు పెరిగాయి. పలు ప్రాంతాలలో దోపీడీలు దొమ్మిలు చోటుచేసుకున్నాయి. మహజీపురాలో ఓ మత్సకారుల వాడలోకి చొరబడి అల్లరిమూకలు పలు ఇళ్లను తగులబెట్టినట్లు, వెంటనే అక్కడి భద్రతా బలగాలు చేరుకున్నట్లు వార్తా సంస్థలు తెలిపాయి.