Friday, May 3, 2024

మన దుకాణాలు

- Advertisement -
- Advertisement -

జనగాం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో ‘మన వస్తువులు మన దుకాణం’
పైలట్ ప్రాజెక్టుగా 60 దుకాణాలు, ప్రభుత్వం సహాయంతో బైరిసన్ ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన వస్తువులు, ఉత్పత్తిలను అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉత్పాదక దుకాణాలను ప్రారంభించింది. ఇటీవల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పోషకాహార లోపంతో అత్యధిక మంది బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీన్ని నియంత్రించేందుకే ప్రభుత్వం సహాయంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బైరిసన్ అనే అగ్రో సంస్థ పేర్కొంది. తొలి విడత ఫైలట్ ప్రాజెక్టుగా జనగాం జిల్లాలో ‘మన వస్తువులుమన దుకాణం’ పేరిట 60 షాప్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గత మూడు నెలల నుంచి వీటికి అనూహ్యమైన ఆధరణ లభిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే మూడు నెలల్లో అన్ని జిల్లాల్లో ఈ షాప్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు బైరిసన్ నిర్వహకులు చెబుతున్నారు. అయితే ఈ దుకాణాల్లో లభించే ఉత్పత్తిలను గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలే తయారు చేయడం గమనార్హం.
డిఆర్‌డిఒ ఆధ్వర్యంలో శిక్షణ
ఈ ఔట్‌లెట్‌లకు కావాల్సిన ఉత్పత్తిలను తయారు చేసేందుకు గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలను ఎంపిక చేసుకుంటారు. వీరిలో ఎవరికి ఏ రంగంపై ఆసక్తి ఉంటే వాటిపై డిఆర్‌డిఏ(డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. వారికి పూ ర్తిస్థాయిలో నైపుణ్యం వచ్చిన తర్వాత నేరుగా ప్రోడక్ట్‌లను తయారు చేయిస్తా రు. అనంతరం నిపుణుల పరిశీలన అ నంతరం ప్రత్యేక సర్టిఫికేట్ కూడా అందిస్తున్నారు.అంతేగాక ఆయా సంఘాల్లో రూ. లక్ష రూపాయలతో రుణాలను ఇ ప్పించి ఈ షాపులను ఏర్పాటు చేయిస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యతగా బైరిసన్ సంస్థ అగ్రిమెంట్ ఇస్తుంది. మరోవైపు స్వయంగా బైరిసన్ సంస్థ స్టాల్‌ను ఏర్పాటు చేస్తే వచ్చే లాభంలో 12 నుంచి 13 శాతం బెన్‌ఫిట్‌ను సదరు నిర్వహుకురాలికి ఇవ్వనున్నారు. అంతేగాక మా ర్కెటింగ్‌కు కూడా డిఆర్‌డిఓలో శిక్షణ పొందిన మహిళలే ఉంటారు.
రైతుల నుంచి నేరుగా..
మన వస్తువులు, మన దుకాణాలకు అవసరమయ్యే వస్తువులు, ఇతర ఉత్పత్తిలకు కావాల్సిన ముడిపదార్ధాలను గ్రామాల్లో పండించే రైతుల నుంచి నేరుగా సేకరించనున్నారు. ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్ట్ కొ రకు 250 గ్రామాల్లో సేకరిస్తున్నట్లు బైరిసన్ సంస్థ చెప్పింది. ప్రతి నెల బైరిసన్, మహిళ సంఘాలు, స్టాల్స్ ప్రతినిధులతో ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తూ కావాల్సిన ఉత్పత్తి, ఆధరణ, అభివృద్ధి అంశాలపై సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ స్టాల్స్‌లో లభించేవి..
నిత్యావసర వస్తువులతో పాటు, ఇతర కిరణా షాపులలో లభించే ప్రతి వస్తువు ఈ స్టాల్స్‌లో ఉంటాయని బైరిసన్ చెబుతోంది. ప్రతి మూడు నెలలకోసారి పాత స్టాక్‌ను తొలగించి, కొత్త స్టాక్‌ను స్టోర్‌లో ఉంచనున్నారు. అయి తే వీటి తయారీకి ఎలాంటి రసాయన పదార్థాలను వినియోగం లేకుండా అందుబాటులోకి తేనున్నట్లు బైరిసన్ సంస్థ పేర్కొంది.
సంతోషంగా ఉంది..
పొదుపు సంఘం నుంచి వ్యాపార రం గంలోకి మారడం సంతోషంగా ఉందని బానాజీపేటకు చెందిన రాయగిరి అరు ణ అన్నారు. దీంతో ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేందుకు సులువుగా ఉం టుందని వ్యక్తం చేశారు. త నకు ప్రభుత్వం, బైరిసన్ సంస్థ సంయు క్తంగా షాపుకు కావాల్సిన అన్ని మౌళిక తెలిపారు.

Bairisons SHG Store Started in Jangaon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News