Wednesday, May 1, 2024

13న సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Balakrishna movie with director Gopichand Malineni

 

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశాన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం ఈనెల 13న ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుంది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News