- Advertisement -
పాక్ సైనికులపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 14మంది పాక్ సైనికులు మృతి చెందారు. పాకిస్థాన్ సైన్యంపై దాడులకు బాధ్యత మాదేనని.. బలూచ్ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగానే దాడులు చేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించింది. పాక్‌పై ఆరు దాడులు చేశామని వెల్లడించింది. పాక్ సైనికులపై రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామని.. వారి ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేసినట్లు తెలిపింది. మొబైల్ టవర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పై యుద్ధానికి కాలు దువ్వుతున్న పాక్ పై బాంబులతో విరుచుకుపడింది. క్వెట్టాలోని పాక్ ఫోర్సెస్ ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్ పై దాడులు బాంబుల వర్షం కురిపించడంతో పాక్ సైనికులు మృతి ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -