Tuesday, September 23, 2025

కార్.. వార్

- Advertisement -
- Advertisement -

కెటిఆర్‌కు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడివి? 
కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసుకున్న కార్లలో
ఎందుకు తిరుగుతున్నారు?
కెసిఆర్ కుటుంబ కంపెనీల పేర్లపై ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? 
ఎక్స్ వేదికగా బండి సంజయ్ వ్యాఖ్య
సంజయ్ కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే కొన్నారంటూ బిఆర్‌ఎస్ నేత
జగదీశ్‌రెడ్డి కౌంటర్

మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య కార్ వార్ మొదలైంది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ల్యాండ్ క్రూజర్ కార్లు ఎలా వచ్చాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తే, బండి సంజయ్ కార్లు ఏ షోరూంలో కొనుగోలు చేశారో.. కెటిఆర్ కూడా అక్కడే కొనుగోలు చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇ చ్చారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారని, వారు ఎక్కడ తెచ్చారో తమకెలా తెలుస్తుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. తాను కారు అమ్మేస్తా ఎవరైనా కొంటారని చెప్పారు. బండి సంజయ్ హోమ్ మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏమైనా వాస్కోడిగామానా లేక కొలంబసా..అంటూ ఎద్దేవా చేశారు.

అంతకుముందు కెటిఆర్‌పై బండి సంజయ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా..? అని ప్రశ్నించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కెటిఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ నిలదీశారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. మార్కెట్ ధర చెల్లించారా… లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా..? అని అడిగారు. పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా.. నకిలీ ఆదాయమా.. లేక మనీలాండరింగ్ ద్వారానా..? అంటూ కెటిఆర్‌పై ప్రశ్నలు సంధించారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ : జగదీష్‌రెడ్డి
ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని, బిఆర్‌ఎస్ పార్టీ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు కారణం కాంగ్రెస్, బిజెపి పార్టీలే అని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి,కె.సంజయ్‌లతో కలిసి సోమవారం అసెంబ్లీ సెక్రటరీని కలిసి అఫిడవిట్ సమర్పించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బిఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎలు నియోజక వర్గ ప్రజలను ద్రోహంచేసి పార్టీ మారారని మండిపడ్డారు. అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించామని తెఇలపారు. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడుతున్నారని, సోయి, జ్ఞానంతో మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం ఏదైనా…ప్రజల దృష్టిలో ఆయనేంటో అర్థం అయిందని విమర్శించారు. ఉప ఎన్నికలు రావటం ఖాయం అని, పార్టీ మారిన ఎంఎల్‌ఎలు మట్టి కరవటం ఖాయం అని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు బ్రెయినే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదిలో జలాల్లో వాటాలపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.కాంగ్రెస్ దుర్మార్గం వల్లనే కృష్ణా జలాల్లో 299 వాటా వచ్చిందని, చర్చించటానికి డేట్ ఫిక్స్ చేస్తే ఆధారాలతో వస్తామని చెప్పారు.

Also Read: బతుకమ్మ వేడుకలపై పోలీసుల ఆంక్షలా?: రాంచందర్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News