Thursday, October 10, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

Be vigilant against cybercrime

మై హోం జెవెల్‌లో అవగాహన సదస్సు
పాల్గొన్న సైబర్ క్రైం ఎసిపి బాలకృష్ణా రెడ్డి

హైదరాబాద్: విద్యావంతులు కూడా సైబర్ నేరస్థుల బారినపడుతున్నారని సైబర్ క్రైం ఎసిపి బాలకృష్ణా రెడ్డి అన్నారు. మదీనగూడలోని మైహోం జెవెల్ క్లబ్ హౌస్‌లోని న్యూ ఫంక్షన్ హాల్‌లో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసిపి బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ చాలామంది సైబర్ నేరస్థులు రూపొందిస్తున్న నకలీ కస్టమర్ కేర్ సెంటర్లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. కెవైసి అప్డేట్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, లోన్లు, బహుమతులు, ఆఫర్లు, లాటరీలు, డిపాజిట్లు వంటి వాటిని ప్రలోభపెట్టి మోసం చేస్తున్నారని అన్నారు.

అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అకౌంట్ నంబర్లు, క్రెడిట్ కార్డు నంబర్లు, డెబిట్ కార్డు నంబర్లు, ఆధార్ కార్డు నంబర్, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని కోరారు. సైబర్ నేరాలు చేసేవారిలో ఎక్కువ మంది ఉత్తరాది వారి కావడంతో పట్టుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై వారు చాలాసార్లు దాడి చేశారని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మియాపూర్ ఎసిపి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దురాశ, నిర్లక్షం, అజాగ్రత్త వల్లే సైబర్ నేరస్థులకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరస్తులు అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి ఎరవేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వెల్షేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీధర్ రావు, ప్రధాన కార్యదర్శి నంద కిషోర్, కార్యవర్గ సభ్యులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, రెసిడెంట్స్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News