Saturday, April 27, 2024

బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
betting gang arrested in hyderabad
ఇద్దరు బూకీలు, పంటర్ అరెస్టు
రూ.74,83,000 స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను ఎస్‌ఓటి మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.53 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాంక్‌లోని రూ.21,82,254 లక్షలను ఫ్రీజ్ చేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సిపి మహేష్ భగవత్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, తిరుమలగిరి, ఎస్‌పి కాలనీ, ప్లాట్ నంబర్ 19కి చెందిన చున్నం కిరణ్, సయిద్ అక్విల్ అహ్మద్, ఆనెగు సురేందర్ రెడ్డి కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎంబిఏ చేసిన కిరణ్ జాబ్ వీసాపై శ్రీలంక, యూకెకు 2003లో వెళ్లాడు. అక్కడి రెస్టారెంట్లలో, క్యాసినోలు, క్లబ్బుల్లో పనిచేశాడు.

ఈ సమయంలో ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. బెట్‌ఫైర్. కామ్, బెట్ 365, 1ఎక్స్‌బెట్ తదితర యాపుల్లో వాటిల్లో ఎలా బెట్టింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో తెలుసుకున్నారు. తాను కూడా ఏజెంట్‌గా మారి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. తన వివరాలు తెలియకుండా వేరే కంపెనీ పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్‌ఫేయిర్.కామ్‌లో రూ.20లక్షలు చెల్లించి మెంబర్ షిప్ తీసుకున్నాడు. బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. 2018 నుంచి వెయ్యిమంది పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బ్యాంక్ ఖాతాను తన స్నేహితుడు అక్వీల్ పేరుతో నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో స్పోర్ట్, క్యాసినోలపై బెట్టింగ్ కడుతున్నాడు.

ఈ క్రమంలోనే మధ్యలో శ్రీలంక, యూకె, గోవాను సందర్శించి క్యాసినోల్లో బెట్టింగ్ కడుతున్నాడు. గోవాలో నిందితుడు కిరణ్ చాలామంది పంటర్లకు తెలుసు. అక్కడి నుంచి బెట్టింగ్‌పై పూర్తి అవగాహన ఉన్న నేపాల్‌కు చెందిన నలుగురు మహిళలను తీసుకుని వచ్చి మూసాపేటలోని రెయిన్‌బో విస్టాలో నెలకు రూ.30,000కు అద్దెకు ఇంటిని తీసుకుని వారి ద్వారా టెలిగ్రాం యాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నాడు. సమాచారం తెలియడంతో మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, నర్సింహస్వామి, ఎస్సై రాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News