- Advertisement -
అమరావతి: ట్యూషన్ మాస్టారు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బూర్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి మరో మహిళతో కలిసి గ్రామంలో పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. శనివారం ఉపాధ్యాయులురాలు రాకపోవడంతో మూడో తరగతి చదువుతున్న బాలిక(8) గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో ఎవరో రావడంతో బాలిక తప్పించుకొని ఇంటికెళ్లిపోయింది. కూతురు భయపడడం జరిగిన సంగతి తల్లిదండ్రులకు తెలిపింది. సోమవారం సాయంత్రం గ్రామస్థులు ట్యూషన్ మాస్టారుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ కుమార్‌పై గతంలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.
- Advertisement -