Sunday, May 5, 2024

జవాన్ల శవపేటికను మోసిన సిఎం..

- Advertisement -
- Advertisement -

దంతేవాడ: చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మావోయిస్టులు మాటు వేసి మందుపాతర పేల్చి 10 మంది జవాన్లను బలి తీసుకున్న ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. మృతదేహాలను అందుకునే సమయంలో జవాన్ల కుటుంబ సభ్యుల వేదన చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు ఒక పక్క, ‘ భారత్ మాతాకీ జై’ నినాదాలు మరోపక్కన వినిపిస్తుండగా ఆ శవాలను వారి స్వస్థలాలకు తరలించారు.

మృత జవాన్లకు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఎం స్వయంగా ఒక శవపేటికను వాహనం దాకా మోశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ‘ జవాన్ల త్యాగాలు వృథాగా పోవు.మావోయిస్టులను మట్టుబెట్టేందుకు జరుపుతున్న పోరాటాన్నిమరింత ఉధృతం చేస్తాం’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News