Friday, April 26, 2024

రహస్య పత్రాల్లో ఏముందో బైడెన్‌కు తెలియదు: వైట్‌హౌస్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యక్తిగత నివాసం, కార్యాలయంలో రహస్య పత్రాలు లభించడంపై శ్వేతసౌధం స్పందించింది. ఆ కీలక పత్రాల్లో ఏముందో అధ్యక్షుడు బైడెన్‌కు తెలియదని వైట్‌హౌస్ తెలిపింది. బైడెన్‌పై విపక్షాల తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో వైట్‌హౌస్ అధ్యక్షుడు బైడెన్‌కు అండగా నిలిచింది. వాషింగ్టన్ డిసిలోని పెన్ బైడెన్ సెంటర్, డెలావర్‌లోని విల్మింగ్టన్‌లోని బైడెన్ వ్యక్తిగత నివాసంలో రహస్య పత్రాలు లభించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ తెలిపారు. దర్యాప్తు చేయడానికి రాబర్ట్ హుర్‌ను న్యాయవాదిగా నియమించినట్లు అటార్నీ జనరల్ వెల్లడించారు. వైట్‌హౌస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు బైడెన్ రహస్య పత్రాలు, సమాచారం విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని అమెరికా ప్రజలు తెలుసుకోవాలన్నారు.

రహస్య పత్రాలు లభించడంపై బైడెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్కైవ్స్‌లో ఉండాల్సిన అధికార పత్రాలు గ్యారేజీలో లభ్యమవడాన్ని బైడెన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు చేయడానికి న్యాయశాఖకు అధ్యక్షుడు ఆమోదం తెలిపారని అటార్నీ జనరల్ తెలిపారు. కాగా బైడెన్ 2009నుంచి 2016 మధ్య కాలంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి క్లాసిఫైడ్ రికార్డులను బైడెన్ సహాయకులు విల్మింగ్టన్ హోం గ్యారేజీలో కనుగొన్నారు.

పత్రాలను కనుగొన్న వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా న్యాయశాఖ ఆర్కైవ్స్‌కు సమాచారం అందించారు. ఆ పత్రాల సమాచారం అధ్యక్షుడు బైడెన్ ఆయన సిబ్బందికి తెలియకపోవడంతో న్యాయశాఖను సంప్రదించారని అటార్నీ జనరల్ మెర్రిక్ తెలిపారు. ఆ పత్రాలు అక్కడికి ఎలావచ్చాయనేది దర్యాప్తులో తేలుతుందని, దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జీన్ పియరీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News