Thursday, October 10, 2024

బిజెపికి భారీ షాక్..

- Advertisement -
- Advertisement -

కామారెడి : బిజెపి సీనియర్ నాయకురాలు మహిళా మోర్చా జిల్లా మాజి అధ్యక్షురాలు దత్తేశ్వరీ బిజెపి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు మాజి మంత్రి షబ్బీర్ అలీ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా దత్తేశ్వరీ మాట్లాడారు. పార్టీ కోసం పని చేస్తున్న నన్ను అవమానాలకు గురిచేశారని మనస్థాపానికి గురై బాధతో బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. దీనికి కారణం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియంత పోకడ భారతీయ జనతా పార్టీ జాతీయ సిద్దాంతాలు వేరు కామారెడ్డి జిల్లా సిద్దాంతాలు వేరుగా ఉన్నాయని చెప్పారు. కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలను అమ్ముకుని తమ స్వంత ప్రయోజనాల కోసం పని చేస్తుందని ఒంటెద్దు పోకడలతో ఒక వర్గానికే ప్రోత్సహిస్తూ మోనార్ఖ్ లా వ్యవహరిస్తుందని ఆమె పేర్కొన్నారు. షబ్బీర్ అలీ చేసిన అభివృద్ధ్ది చూసి వారి ద్వారనే కామారెడ్డి అభివృద్ధ్ది చెందుతుందని బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతు నా తోబుట్టువుతో సమానమైన దత్తేశ్వరీ డ్వాక్రా మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఐదు సంవత్సరాలు బిజెపి పార్టీ కి సేవ చేసిన తగిన ప్రాధాన్యత లభించలేదని అన్నారు. ఈ క్ర మంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చందు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనెశ్రీను, జిల్లా కార్యదర్శి పంపరి లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News