Thursday, May 2, 2024

‘ఆదిపురుష్’ బిగ్ సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

Big surprise in adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేయనున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. 3డీలో రూపొందే ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు లంకేష్‌గా నటించనున్నారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని ప్రకటించాడు ప్రభాస్. ’ఆదిపురుష్’ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు డార్లింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారంటే పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఆదిపురుష్’ చిత్రా న్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నా యి. కాగా యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ మూవీ ఇది కావడంతో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాష ల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ప్రభాస్‌కి ప్రపంచ వ్యాప్తం గా ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని పలు విదేశీ భాషల్లోకి కూడా ఈ చిత్రాన్ని అనువాదం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News