Sunday, April 14, 2024

జీపు, బైక్‌ను ఢీకొట్టిన ట్రక్కు: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిహార్ రాష్ట్రం కైముర్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ద్విచక్రవాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీపు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మరో మార్గంలోకి వెళ్లాయి. అదే సమయంలో ఎదురుగా ట్రక్కు వచ్చి జీపు, బైక్‌ను ఢీకొట్టడంతో తొమ్మిది మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News