Thursday, May 2, 2024

బిజెపి కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ : తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక మార్పులు చేస్తోంది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ ఇటీవల నియమించింది. ఎన్నికలు జరిగే అనేక రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జిగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను బీజేపీ నియమించింది.

అసిస్టెంట్ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. అలాగే, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఓపీ మాథుర్, సహాయ ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, రాజస్థాన్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ మాజీ డిప్యూటీ సిఎం నితిన్ పటేల్ సహాయ ఇన్‌ఛార్జ్‌గా, మధ్యప్రదేశ్‌కు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను, సహాయ ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను నియమించారు. ఈ నియామకాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం కీలక మార్పులపై దృష్టి సారించింది. తాజాగా బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి, పార్టీ మాజీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బిజెపి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా చేరికల కమిటీ చైర్మన్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నియమితులయ్యారు. బిజెపి నాయకత్వం మరో మూడు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News