Thursday, June 13, 2024

కొడంగల్​పై కుట్రలు

- Advertisement -
- Advertisement -

ఓటర్లు తమ తీర్పుతో ఈ కుట్రలకు చరమగీతం పాడాలి
కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు బిజెపి కుయుక్తులు
వంద రోజుల్లోనే రూ.5వేల కోట్లతో అభివృద్ధి పనులు
చేపట్టాం పాలమూరుకు జాతీయస్థాయి హోదా
సాధించలేకపోయిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు
అరుణ తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బిజెపికి లేదు
కొడంగల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పదేండ్లు దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయని బిజెపి సర్కారుకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వలేని బిజెపి సర్కారుకు, ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు.

నన్ను దెబ్బకొట్టేందుకు బిజెపి, బిఆర్‌ఎస్ కుతంత్రాలు

మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో తనను దెబ్బ కొ ట్టేందుకు కొడంగల్‌ను పావుగా వాడుకునేందుకు బిజెపి, బిఆర్‌యస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశా రు. కొడంగల్‌లో తమ పార్టీని దెబ్బతీసి తన ఇమేజ్‌ను తగ్గించాలని, తద్వా రా అభివృద్ధిని అడ్డుకోవాలని బిజెపి మహాబూబ్‌నగ ర్ పార్లమెంట్ అభ్యర్థి డికె అరుణ ప్రణాళికలు రచిస్తు న్నారని, వారి కుట్రలను విజ్ఞులైన ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం రోజు వికారాబాద్ జిల్లా, నియోజకవర్గ కేంద్రంలోని తన స్వగృహంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పా ల్గొన్న ముఖ్యమంత్రి ఎన్నికల నిర్వహణపై ముఖ్య నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఎం మా ట్లాడుతూ.. గతంలో ఎన్న డూ లేనివిధంగా కొడంగల్ ప్రాంతానికి రాష్ట్రంలోనే అత్యున్నత పదవి దక్కిందని అన్నారు. తాను గతంలో చెప్పినట్లుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు, 17 పార్లమెంట్ స్థానాల కు బి-=ఫారం అందించే మహా అవకాశం కొడంగల్ ప్రాంతానికి దక్కిందని అన్నారు. ఈ అవకాశం క ల్పించిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఈ ప్రాం తం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొందరు తనను ఎందుకు కిందపడేయాలని చూస్తున్నారో ప్రజలకు వివరించాలని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజులలో కొడంగల్ ప్రాంతానికి 5000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిధులను తీసుకు వచ్చినందుకు వారు కొడంగల్ ప్రాంతంపై కక్ష కట్టారని అరోపించారు. ఈ ప్రాంతానికి వంద రోజులలో మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలను తీసుకువచ్చామని అన్నారు.
వందల కోట్ల రూపాయలతో తండాలకు బిటి రోడ్లు తీసుకువచ్చామని అన్నారు.4000 కోట్ల రూపాయలతో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చామని అన్నారు.

ఇన్ని అభివృద్ధ్ది పనులను తీసుకువచ్చిన తనను ఎందుకు కింద పడేయాలని చూస్తున్నారో తెలపాలని అన్నారు. నారాయపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చినందుకా, కాలేజీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువచ్చి ఈ ప్రాంత యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినందుకా వారు ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి, అన్ని పదవులు అనుభవించిన అరుణమ్మ బిజెపిలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన తరువాత మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రధానమంత్రి నుండి ఎన్ని నిధులు తీసుకు వచ్చారో జిల్లా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు జీవధార అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాన మంత్రితో పోట్లాడి కనీసం జాతీయ హోదా కూడా తీసుకురాలేక పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. జిల్లాకు ఏమీ చేయలేని అరుణమ్మ కొడంగల్ అభివృద్ధిని సైతం అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.

కొడంగల్‌లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని వారు బిఆర్‌యస్‌తో కలిసి విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలో చెప్పాలన్నారు. ఆడబిడ్డలకు ఉచితబస్సు సౌకర్యం కల్పించినందుకా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేసినందుకా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా.. ఎందుకో తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్‌యస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్‌రూం ఇళ్లయినా ఇచ్చిందా ప్రజలు గమనించాలన్నారు. ప్రజల ఓట్లతో రెండుసార్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ మూడవసారి ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని ప్రశ్నించారు.

పదేండ్లు దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయని బిజెపి సర్కారుకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వలేని బిజెపి సర్కారుకు, ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు కొడంగల్ అన్న ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై తనను అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

తన ప్రతిష్టను తగ్గించాలని చూడడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంలో జరిగే కుట్రలో భాగమని, ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఒక్క యువకుడు గుర్తించాలన్నారు. ప్రత్యర్థులు పన్నే కుట్రలు, కుతంత్రాలను నియోజకవర్గ ప్రజలు తిప్పికొట్టాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడి, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News