Sunday, April 28, 2024

బూత్‌ల వారీగా కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి కి సానుకూల వాతావరణం ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతమైన పలితాలు సాధిస్తామ ని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోడీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని పేర్కొన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, సీనియర్ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్
హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల దగ్గరకు వెళ్లాలని సూచించారు.

మహిళలు స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, మోడీ ప్రధాని కావాలని బలంగా కోరుతున్నారని తెలిపారు. కేంద్ర పథకాలతో ఇంటింటికి వెళ్లి ఓటర్‌ను కలవాలని, ఏ పోలింగ్ బూత్ కు ఆ పోలింగ్ బూత్ వారీగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక ముఖ్య నేతను సమన్వయ కర్తగా నియమించాలని, తాను కూడా ఒక పోలింగ్ బూత్‌కు కో ఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలోని 17 సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాడని, ఆరు గ్యారంటీలు సిఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికి అమలు చేయలేడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలు మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలన మోడీ 9 సంవత్సరాల పాలనపై ప్రజలకు వివరించాలి కాంగ్రెస్ చరిత్రనే అవినీతిమయమన్నారు. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడుతాడని దేశ ప్రజలంతా ఆయనకు మద్దతు పలకాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News