Thursday, April 25, 2024

తెలంగాణలో నాలుగు బహిరంగ సభలు : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బిజెపి కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు జన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల రోజుల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సభలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. జూన్ 1 నుంచి 21 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సభలకు కేంద్రమంత్రులు హాజరవుతారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి మండలంలో 10 చోట్ల నిర్వహించాలని నిర్ణయించారు. 22న శక్తి కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో సమావేశాలు నిర్వహిస్తారు. జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా 10లక్షల మంది బూత్ కమిటీలతో మోదీ వర్చువల్ సమావేశమవుతారు. జూన్ 25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేధావులు, విద్యావంతులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News