Friday, April 26, 2024

రెండు వేల నోట్ల రద్దు..వందలు వేల సిత్రాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మామిడి పండ్లు , ఐస్‌క్రీమ్‌లు మొదలుకుని అత్యంత విలాసవంత వాచ్‌లు, ఫోన్లు వంటి వాటిని ఇప్పుడు రూ 2వేల నోట్లున్న వారు విచ్చలవిడిగా కొనుక్కుంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఇంతకు ముందు ఉన్నట్లుండి తీవ్ర గందరగోళం సృష్టించిన కేంద్రం కేంద్రం ఇప్పుడు సెప్టెంబర్ వరకూ వెసులుబాటు కల్పించి రెండు వేల రూపాయల నోటుకు కాలం చెల్లేలా చేయడంతో ఈ నోట్లు దండిగా ఇంతకాలం తమ వద్ద పెట్టుకున్న వారు తమ శక్తిని బట్టి వీటితో ఏది పడితే అది కొనుక్కుంటున్న వైనం పలు నగరాలు, పట్టణాలలో సందడిని సృష్టించింది. బ్యాంకులకు వెళ్లడం, పలు ఫార్మాలిటిలను పాటించడం, ఎక్కె గుమ్మం దిగే గుమ్మం తంతులు ఎందుకు అని పలువురు ఈ రెండువేల నోట్లతో వేలంవెర్రి కొనుగోళ్లకు దిగుతున్నారు.

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల దశలో నగదు చలామణి ఎక్కడపడితే అక్కడ దండిగా చాపకింద నీరులాగా ఉంటుంది. లెక్కల్లోకి రాని లావాదేవీలు అనేకం ఈ క్రమంలో ఈ డబ్బులతో సాగుతుంటాయి. దీనిని గుర్తించే కేంద్రం ఆలోచలనలకు అనుగుణంగా పెద్ద నోటు రద్దు చర్యకు దిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే వీటితో ఎటువంటి సంబంధం లేని మధ్య తరగతి అంతకు మించిన స్థాయి ఉన్న వారు తమ వద్ద ఉన్న రెండువేల నోట్లను ఖర్చుపెట్టేందుకు నానాదార్లు తొక్కుతున్నట్లు వెల్లడైంది. పెద్ద పెద్ద మాల్స్ ఈ రెండువేల రూపాయల నోట్లను తీసుకుంటాయి కాబట్టి జనం అక్కడికి వెళ్లుతున్నారు. పైగా ఈ విధంగా రెండువేల నోట్ల రద్దు చర్యతో పలు పెద్ద షాప్‌లలో విక్రమాలు పెరిగాయి. చాలా మాల్స్ రెండువేలు తెండి ఇష్టం వచ్చింది తీసుకువెళ్లండని ఆఫర్లు వెలువరిస్తున్నాయి.

ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెటకు సమీపంలో మామిడి పండ్లు విక్రయించే 30 ఏండ్ల మెహమ్మద్ అజర్ రెండువేల రూపాయలకు సరిపడా పండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. తనకు ఈ విధంగా పది పదిహేను వరకూ ఈ నోట్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ వరకూ గడువు ఉంది కాబట్టి వీటిని తాను ఈ లోపల డిపాజిట్ చేసుకుంటానని చెప్పారు. సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్‌లో రెండువేల రూపాయల నోట్ల రద్దు ప్రకటన నాటి నుంచి దాదాపు 70 శాతం వరకూ విక్రయాలు పెరిగినట్లు స్టోర్స్ మేనేజన్ మైకెల్ మార్టిస్ తెలిపారు. శుక్రవారం నుంచి తమకు అత్యధికంగా రెండు వేల రూపాయల నోట్ల రూపంలోనే చెల్లింపులు జరిగినట్లు జొమాటో ఫుడ్ పంపిణీ సంస్థ తెలిపింది. అయితే చాలా వరకూ షాపులు ఎందుకొచ్చిన తిప్పలు అని ఈ నోట్లను తీసుకోవడం లేదు. 2016లో బ్యాంకుల్లో పెద్ద నోటు డిపాజిట్ల దశలో తమకు చుక్కలు కన్పించాయని, తిరిగి అప్పటి సీన్ సితారాలను తాము వెతుక్కోకుండా ఉండాలంటే రెండువేలు తప్ప ఏ నోటు ఇచ్చినా ఫర్వాలేదు. లేదా ఆన్‌లైన్ చెల్లింపులు ఉండనే ఉన్నాయని దుకాణాదార్లు చెపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News