Wednesday, May 8, 2024

కాంగ్రెస్ చైనా న్యూస్‌ క్లిక్ అక్రమ సంబంధాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ చైనా ఇతర జాతి వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయిందని, న్యూయార్క్‌టైమ్స్ వార్తాకథనంలో ఈ విషయం వెల్లడించారని బిజెపి విమర్శించింది. చైనా, ఇక్కడి కాంగ్రెస్, భారతీయ న్యూస్ వెబ్‌సైట్ న్యూస్‌క్లిక్ ఈ మూడు భారత వ్యతిరేకత, విద్వేషాల పేగుబంధం సంతరించుకున్నాయని స్పష్టం అయిందని బిజెపి సోమవారం పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ తరువాత రాహుల్ గాంధీ లోక్‌సభలోకి రాగానే బిజెపి ఎంపి నిశికాంత్ దూబే లేచి న్యూయార్క్ టైమ్స్ కథనం గురించి ప్రస్తావించారు. తుక్డే తుక్డే గ్యాంగ్, మీడియాలోని కొన్ని వర్గాలు కలిసి భారత వ్యతిరేక విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తున్నాయని ఇది ప్రమాదకరం అన్నారు.

కాంగ్రెస్ నేతలు తరచూ విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారని, ప్రత్యేకించి భారత్‌పై విద్వేషం పెంచుకున్న చైనా ఇతర దేశాలతో వారి లింక్‌లు సాగుతున్నాయన్నారు. సభ్యుడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాల్సి ఉందని తెలిపాయి. అంతకు ముందు ఇదే అంశంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ రాహుల్‌కు చైనా ప్రేమ పెరిగిందని, ఆయన ఇంట్లో అన్ని చైనా సరుకులే ఉన్నాయని తెలిపారు. న్యూస్‌క్లిక్‌కు భారీగా చైనా నిధులు అందుతున్నాయని, చైనా, రాహుల్, ఈ న్యూస్‌క్లిక్‌ల పేగుబంధం సంగతి తేలాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News