Wednesday, May 15, 2024

బిజెపి ‘సేవా పక్షం’

- Advertisement -
- Advertisement -

17 నుంచి తెలంగాణ అమృత్ మహోత్సవాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పుర స్కరించుకుని భారతీయ జనతాపార్టీ ‘సేవా పక్షం’ పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న ప్రధాని మోడీ పుట్టిన రోజు. ఆ రోజు నుంచి మొదలుకొని గాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్ 17 నుంచి ఈనెల 24 మధ్య ఆయుష్మాన్ భవ పేరిట రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వ హించాలని పార్టీ నిర్ణ యించింది. సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 26 నుంచి| అక్టోబర్ 1 వరకు బూత్ స్వశక్తి కరణ్. బస్తీ సంపర్క్ కార్యక్రమం చేపట్టనున్నారు.
17 నుంచి తెలంగాణ అమృత్ మహోత్సవాలు..
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు బిజెపి ఏర్పాట్లు చేసింది. నిజాం మతతత్వ రాజ్యం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏండ్లు కావొస్తున్నది. బిజెపి అధికారిక పూర్వకంగా తెలంగాణ అమృత్‌మహోత్సవాలను నిర్వహించనున్నది. రజాకార్ల దాడులకు గురైన గ్రామాలకు వెళ్లి స్వాతంత్య్రం సమరయోధులను సన్మానించనున్నారు. వారి స్ఫూర్తితో బిజెపిని తెలంగాణలో ముందుకు తీసుకువెళ్తాం అని పార్టీ నేతలు వెల్లడించారు. అదే బిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ప్రధాని మోదీ గారి జన్మదిన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News