Wednesday, May 8, 2024

ప్రతిపక్షాల సమావేశాలపై బిజెపి విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేవలం అధికార దాహంతో అంతకు మించిన అవకాశ వాదంతో ప్రతిపక్షాలు బెంగళూరు భేటీ తలపెట్టాయని బిజెపి సోమవారం విమర్శించింది. ఈ నేతలకు ప్రజల కన్నా దేశం కన్నా తమ పవర్‌పైనే దృష్టి అని ఇక్కడ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రతిపక్ష బృందం దేశానికి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ మంచి చేయలేదన్నారు.

ఇక ఢిల్లీలో ఇప్పటికీ జనం వరద తాకిడితో తల్లడిల్లుతూ ఉంటే, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వారిని పట్టించుకోకుండా బెంగళూరుకు చెక్కేస్తున్నాడని విమర్శించారు. విపక్షాలలో ఒకపార్టీకి మరో పార్టీకి పడదు. అయితే అధికారం లక్షంతోనే కలిసిసాగే సర్దుబాట్లకు దిగుతున్నాయి. ఆయా పార్టీలు తమ ఉనికిని ఫణంగా పెట్టుకుని ఒక్కతాటికి చేరుతాయా? చేరినా ఇది చిత్తశుద్ధితో జరిగే పరిణామమమేనా అనేది కీలక ప్రశ్న అని బిజెపి స్పందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News