Sunday, August 10, 2025

ఇసి మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయండి.. రాహుల్ గాంధీకి బిజెపి చురక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఇసి) మీద నమ్మకం లేకుంటే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బిజెపి నిలదీసింది. ‘ఓట్ చోరి’ ఆరోపణలో ఆయన రాతపూర్వక ప్రకటనను సమర్పించడంలేదని కూడా ఆరోపించింది. ఎన్నికలపై నమ్మకం లేకపోతే తమ రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా రాజీనామా చేయాలని బిజెపి జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా కోరారు.

బిజెపి ప్రధానకార్యాలయంలో విలేకరుల సమావేశంలో భాటియా మాట్లాడుతూ ‘మీరు(రాహుల్ గాంధీ) మీ డియా ముందు నిరాధార ఆరోపణలు చేస్తున్నా రు. రాజ్యాంగ సంస్థ అడిగినప్పుడు రుజువులు, రాతపూర్వక ప్రకటన ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు’ అన్నారు. ‘రాహుల్ గాంధీ, ఒకవేళ మీ కు ఎన్నికల సంఘంపై, సుప్రీంకోర్టు పరిశీలనల లో నమ్మక లేకుంటే ఒక పనిచేయండి. మొదట లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయండి. ప్రి యాంక గాంధీ మీరు కూడా రాజీనామా చేయం డి. సోనియా గాంధీజీ మీరు కూడా నైతికత ఆ ధారంగా రాజీనామా చేయండి. ఎందుకంటే మీ రు అదే ఎన్నికల సంఘంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు’ అని భాటియా అన్నారు. ‘మీరు అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు, ప్రజల వద్దకు వెళ్లండి’ అన్నారు. ఎన్నికల సంఘంపై నమ్మకం లేనందున కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News